: రక్తదానం చేయాలనుకున్నారు... ప్రాణాలు పోగొట్టుకున్నారు!


రక్తదానం చేసి పలువురి ప్రాణాలు కాపాడదామని భావించిన కొందరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పలువురిని విషాదంలోకి నెట్టింది. నేపాల్ లోని ఖాట్మాండులోని 500 ఏళ్ల చరిత్ర గలిగిన కాష్టమండప్ ఆలయం వద్ద ఓ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రక్తదానం చేసేందుకు ఔత్సాహికులు కొందరు ముందుకు వచ్చారు. వారు రక్తదానం చేస్తుండగా భూకంపం సంభవించింది. దీనిని గమనించిన పలువురు చేతికున్న నీడిల్స్ తొలగించుకుని పరుగులు ప్రారంభించారు. అప్పటికే సమయం మించిపోవడంతో, వారిపై ఆలయం కుప్పకూలిపోయింది. విశేషమైన చరిత్ర కలిగిన కాష్టమండప్ దేవాలయం నామరూపాల్లేకుండాపోయింది. ఈ ప్రమాదంలో బతికి బయపడ్డ అతి కొద్దిమంది, శిబిరంలో పాల్గొంటున్న ఔత్సాహికులు, వైద్యులు, సిబ్బందిని తలచుకుని శోకంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News