: కొడుకు చోరీ చేసిన వస్తువులకు తల్లి మార్కెటింగ్


తల్లి దైవస్వరూపమని భావిస్తుంటారు. కానీ, ఈ తల్లి మాత్రం తద్విరుద్ధంగా వ్యవహరించింది. వివరాల్లోకెళితే... మొయిన్ భాగ్ ఫతేషా నగర్ కు చెందిన హబీబ్ ముస్తఫా (30) దొంగతనాలకు అలవాటుపడ్డాడు. తాళం వేసిన ఇళ్లు ముస్తఫా కంటపడ్డాయంటే పండగే. ఆ ఇళ్లలో ఉన్న విలువైన వస్తువులు దొంగలించి, సొమ్ము చేసుకునేవాడు. ముస్తఫా చోరీ చేయడం, అతడు తెచ్చిన వస్తువులను తల్లి షాహిదా బేగం (55) విక్రయించడం... గత నాలుగైదు నెలలుగా ఈ తంతు కొనసాగుతోంది. అయితే, పోలీసులు ఈ తల్లీకొడుకుల భాగోతాన్ని ఛేదించారు. షాహిదా బేగంను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నించడంతో ఎల్సీడీ టీవీలు, వాషింగ్ మెషీన్ తదితర వస్తువులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న ముస్తఫా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News