: వాట్సన్ ప్రతీకారం తీర్చుకుంటాడా? గేల్ మరోసారి విరుచుకుపడతాడా?
ఐపీఎల్ సీజన్-8లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడనుంది. సీజన్ ఆరంభంలో వరుస పరాజయాలతో తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న బెంగళూరు జట్టు గాడిన పడింది. గేల్, డివిలియర్స్, కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లతో బ్యాటింగ్ లో పటిష్ఠంగా ఉన్న బెంగళూరు స్టార్క్ విజృంభణతో సత్తా చాటుతోంది. వరుస మ్యాచుల్లో విఫలమైన గేల్, స్టార్క్ లిద్దరూ రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ఫాంలోకి రావడం విశేషం. మరోసారి రాజస్థాన్ జట్టు బెంగళూరుతో పోటీ పడనుండడంతో రాజస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాజస్థాన్ బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ రహానే విఫలమైతే పరాజయం పాలవుతోంది. తొలి ఐదు మ్యాచులలో వరుసగా విజయాలు నమోదు చేసిన రాజస్థాన్ జట్టు బెంగళూరుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఫాం కోల్పోయింది. ఈ మ్యాచ్ లో సత్తాచాటి విజయం సాధించాలని రాజస్థాన్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి వాట్సన్ ప్రతీకారం తీర్చుకుంటాడా? మరోసారి రాణించి గేల్ ఫాం కొనసాగిస్తాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.