: పమేలా ఆండర్సన్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కేరళ సీఎం
కేరళలో త్రిసూర్ పూరమ్ ఉత్సవాల్లో ప్రదర్శనకు ఏనుగులను వినియోగించరాదంటూ పెటా ఉద్యమకారిణి, నటి పమేలా ఆండర్సన్ కేరళ సీఎం ఊమెన్ చాందీకి ఈ-మెయిల్ ద్వారా కోరడం తెలిసిందే. అయితే, ఆమె విజ్ఞప్తిని చాందీ తోసిపుచ్చారు. త్రిసూర్ పూరమ్ సంప్రదాయ ఉత్సవమని, అందులో ఏనుగులను ప్రదర్శించడంలో తప్పేమీలేదని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. అసలైన గజరాజులకు బదులు, బొమ్మ ఏనుగులు ఉపయోగించాలని పమేలా తన లేఖలో సూచించింది. అటు, నెటిజన్లు కూడా పమేలా ప్రతిపాదనలను వ్యతిరేకించారు. ఆమె ఓసారి కేరళ వచ్చి చూడాలని, ఆ ఉత్సవాన్ని వీక్షిస్తే ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని వారు సలహా ఇచ్చారు. పెటా జంతువుల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడే సంస్థ అన్న సంగతి విదితమే.