: యాదాద్రి విద్యుత్ కేంద్రంగా మారిన దామరచర్ల థర్మల్ విద్యుత్ కేంద్రం
ఇటీవలే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంస్థ పేరును కూడా మార్చారు. దామరచర్ల థర్మల్ విద్యుత్ కేంద్రం పేరును యాదాద్రి విద్యుత్ కేంద్రంగా మారుస్తున్నట్టు ఆయన తెలిపారు. 2016 నాటికి తెలంగాణను విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. ఇప్పటికే 4,320 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని, వచ్చే మార్చి నాటికి మరో 3వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. 2018 నాటికి మిగులు విద్యుత్ సాధిస్తామని కేసీఆర్ చెప్పారు.