: అది నేనెలా చెబుతాను... నేను ఆ సినిమా నిర్మాతను కాను!: అక్షయ్ కుమార్


నేపాల్ భూకంప బాధితులకు సహాయం అందించాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిన అవసరం లేదని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశాడు. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమా ఎల్లుండి విడుదల కానున్న నేపథ్యంలో, ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లను నేపాల్ బాధితులకు అందిస్తారన్న పుకార్లపై ఆయన ట్విట్లర్లో స్పందించాడు. నేపాల్ బాధితులకు సహాయం చేయడానికి సినిమా విడుదల వరకూ ఆగాలా? అని ప్రశ్నించాడు. అవన్నీ వదంతులని ఆయన తేల్చిపారేశాడు. తాను ఆ సినిమా నిర్మాతను కాదని, అలాంటి నిర్ణయాలు తాను తీసుకోనని అక్షయ్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News