: చైనాలోని 4000 ధియేటర్లలో సందడి చేయనున్న 'పీకే'


బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన 'పీకే' సినిమా చైనాలో రిలీజ్ కు సిద్ధమవుతోంది. వివాదాల మధ్య విడుదలై అద్భుత విజయం, రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన 'పీకే' చైనీయులను ఆకట్టుకుంటుందని ఈ సినిమా దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ విశ్వాసం వ్యక్తం చేశాడు. గతంలో తమ కాంబినేషన్ లో వచ్చిన '3 ఇడియట్స్' ఈ సినిమాకు చైనాలో మంచి ఆదరణ లభించిందని హిరాణీ తెలిపాడు. చైనాలో 3500 నుంచి 4000 ధియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని ఆయన చెప్పాడు.'పీకే' ఇప్పటికే పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, మలేసియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక దేశాల్లో విడుదలై విజయం సాధించింది. ఈ జూలైలో చైనాలో విడుదల కానుంది.

  • Loading...

More Telugu News