: భూకంప రాడార్ పై చెన్నై


నేపాల్ భూకంపం నేపథ్యంలో, ముప్పున్న కొన్ని ప్రాంతాలు తెరపైకి వచ్చాయి. వాటిలో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై కూడా ఉంది. అన్నా యూనివర్శిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ శాంతకుమార్ మీడియాతో మాట్లాడుతూ... తమిళనాడులోని చాలా నగరాలు, పట్టణాలు మూడో నెంబర్ భూకంప జోన్ లో ఉన్నాయని తెలిపారు. చెన్నై, కోవై, మధురై, నాగపట్నం, తంజావూరు, పాండిచ్చేరి నగరాలు ప్రమాదకర జోన్ లో ఉన్నాయని ఆయన వివరించారు. ఈ జోన్ లో 6 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తాయని, అదే జరిగితే భారీ వినాశనం తప్పదని ఆయన వివరించారు. చెన్నై మహానగరంపై ఆ ప్రభావం ఎక్కువని అన్నారు. చెన్నైలో అత్యధిక శాతం భవనాలు భూకంప తాకిడిని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితం కాలేదని తెలిపారు. శక్తిమంతమైన భూకంపం వస్తే ఈ భవనాలు నిలుస్తాయన్న నమ్మకంలేదని శాంతకుమార్ పేర్కొన్నారు. చెన్నై సహా పరిసర తీరప్రాంతాలన్నీ తేలికపాటి నేలలని, పట్టు ఉండదని వివరించారు.

  • Loading...

More Telugu News