: బద్రీనాథ్ లో విరిగిపడ్డ కొండచరియలు... మార్గమధ్యంలో నిలిచిపోయిన 3 వేల మంది యాత్రికులు


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్-విష్ణు ప్రయాగల మధ్య గల రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనతో దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న దాదాపు 3వేల మంది భక్తులు మార్గమధ్యంలోనే ఆగిపోయారని అధికారులు ప్రకటించారు. వర్షాలు కురుస్తుండటంతో, కొండ చరియలు విరిగిపడ్డాయని... మరిన్ని చరియలు విరిగిపడే అవకాశం ఉందని వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడిపోవడంతో జోషిమఠ్, బద్రీనాథ్, పందుకేశ్వర్, గోవింద్ ఘాట్ లకు వెళ్లే వాహనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. విరిగిపడ్డ చరియలను తొలగించేందుకు భద్రతాదళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

  • Loading...

More Telugu News