: రేవంత్ రెడ్డి ఓ గజ్జి కుక్క: ఎంపీ బాల్క సుమన్
తెలంగాణ టీడీపీ నేతలపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దాడుల తీవ్రత పెంచారు. టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ తాజాగా నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ఓ గజ్జి కుక్క అని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. కేసీఆర్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారని సుమన్ కొనియాడారు. అసలు, తెలంగాణలో టీడీపీ నాశనం కావడానికి ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డే కారణమన్నారు.