: జూబ్లీ, బంజారాహిల్స్ ఖాళీ స్థలాల్లో పేదల ఇళ్లు: కేసీఆర్
నిలువ నీడలేని పేదలకు ఖరీదైన స్థలాల్లో ఇళ్లు కట్టిస్తే తప్పులేదని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వీలైతే పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన అన్నారు. నేడు ఆయన పేదల గృహ నిర్మాణాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజధాని నగరంలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీలు, క్లబ్ లకు పదుల ఎకరాల స్థలం ఉందని గుర్తు చేస్తూ, వీటిల్లో చాలా భాగం ఉపయోగంలో లేదని, దానిని పేదల ఇళ్ల నిర్మాణం కోసం వినియోగిస్తామని అన్నారు. సమగ్ర సర్వే ద్వారా నగరంలో ఇళ్లు లేని 2 లక్షల మంది పేదలున్నట్టు తేలిందని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం తరపున ఇళ్లు కట్టిస్తామని అన్నారు.