: చంద్రబాబు కొత్త ఇల్లు కడుతుంటే ప్రజలు భయపడుతున్నారు: మంత్రి మహేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు హైదరాబాదులో కొత్త ఇల్లు కడుతుంటే ఏపీ ప్రజలు భయపడుతున్నారని, ఆయన ఇక ఏపీకి రాడేమోనని సందేహిస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పక్క రాష్ట్రం గురించి ఆలోచించడం మాని, సొంత రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు. ఇక, తెలంగాణ టీడీపీ నేతలను ఆయన పెంపుడు కుక్కలతో పోల్చారు. టీడీపీ మునిగిపోయే నావ వంటిదని, దాంట్లో ఉండేందుకు ఎవరూ ఇష్టపడడం లేదని పేర్కొన్నారు.