: షాపు తెరవకపోతే పూటగడవదు...తెరిస్తే ప్రాణగండం: నేపాల్ దీనగాథ
నేపాల్ లో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలెన్నో. రూపాయి రూపాయి కూడబెట్టి సంపాదించుకున్నదంతా భూకంపం ధాటికి తుక్కుగా మారిపోయింది. ఈ నేఫథ్యంలో నిత్యావసర సరకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇదే అదనుగా కాస్తో కూస్తో పోగేసుకుందామన్న ఆశతో షాపు తెరుద్దామంటే బీటలు వారి కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. అయినా సరే ప్రాణాలకు తెగించి తన కిరాణా షాపు ఓపెన్ చేశాడో భూకంప బాధితుడు. షాపు తెరవకపోతే పూటగడవదని, ఆ షాపే జీవనాధారమని, అందుకే దానిని ఓపెన్ చేశానని ఆ యజమాని చెబుతున్నాడు. కానీ సహాయక బృందాలు ఈ షాపు ఉన్న భవనం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశాయి. షాపు ఉన్న భవనం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. అయినా బతుకు బండి ప్రాణాలను కూడా లెక్కచేయనీయడం లేదు.