: ఏపీ ఐపీఎస్ అధికారిని తెలంగాణకు కేటాయించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐపీఎస్ అధికారి ఎం.శివప్రసాద్ ను తెలంగాణకు కేటాయించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్య కారణాల రీత్యా ఆయనను ఏపీ నుంచి తెలంగాణకు కేటాయిస్తున్నట్టు తెలిపింది. శివప్రసాద్ 1998 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి.