: తైవాన్, న్యూజిలాండ్ సాయాన్ని తిరస్కరించిన నేపాల్
భారీ భూకంపంతో విలవిల్లాడుతున్న నేపాల్ కు సహాయం చేసేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది. ఇప్పటికే కొన్ని దేశాలు తమ చేతనైన సాయం చేస్తుండగా, తాజాగా తైవాన్, న్యూజిలాండ్ దేశాలు కూడా సాయం చేయడానికి ముందుకొచ్చాయి. అయితే, ఈ దేశాల నుంచి సాయం స్వీకరించడానికి నేపాల్ తిరస్కరించింది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ రెండు దేశాల సాయాన్ని నేపాల్ తిరస్కరించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. మరోవైపు తమకు సన్నిహితంగా ఉండే అన్ని దేశాల నుంచి సాయాన్ని ఇప్పటికే నేపాల్ అర్థించింది.