: చివరికి మిగిలేది ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మాత్రమే: టీ-మంత్రి జగదీష్ రెడ్డి


తెలంగాణ తెలుగుదేశం పార్టీలో చివరకు మిగిలేది ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మాత్రమేనని టీఆర్ఎస్ నేత, మంత్రి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి బతుకు లేదని భావించిన తరువాతనే నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. ఆంధ్రా ప్రాంతంలో మహానాడు పెడితే రైతులు, మహిళలు నిలదీస్తారన్న భయంతో హైదరాబాదులో పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణకు తానే మిగులు బడ్జెట్ వచ్చేలా చేశానని గొప్పలు పోతున్న ఆయన, ఆంధ్రా ప్రాంతాన్ని అదే విధంగా ఎందుకు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా హైదరాబాదును వదిలి తన రాష్ట్రానికి పోయి పనిచూసుకోవాలని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News