: వడ్డీ వ్యాపారిని రాళ్లతో కొట్టి చంపిన ప్రజలు... కడప జిల్లాలో సంచలనం
ప్రజలకు అప్పులిచ్చి వడ్డీల పేరిట పీక్కుతింటున్న ఓ వ్యక్తిని ప్రజలు రాళ్లతో కొట్టి చంపారు. వైఎస్సార్ కడప జిల్లా, జమ్మలమడుగు మండలం పెద్దండూరులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వడ్డీలకు డబ్బులిచ్చే వ్యాపారి చంద్రశేఖర్ ను గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గత అర్ధరాత్రి రాళ్లతో తీవ్రంగా కొట్టి చంపారు. చెల్లించాల్సిన బకాయిల విషయమై వీరి మధ్య తలెత్తిన వివాదమే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టామని తెలిపారు.