: రణరంగంగా మారిన రాప్తాడు... తహశీల్దార్ కార్యాలయానికి నిప్పు, పోలీసులపై రాళ్ల వర్షం


అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి పడగవిప్పాయి. రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో వైకాపా నేత ప్రసాద్ రెడ్డిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. దీంతో, అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. ప్రసాద్ రెడ్డి అనుచరులు రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఆ తర్వాత నిప్పు పెట్టారు. కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ వాహనాలను కూడా ఆహుతి చేశారు. శాంతి భద్రతలను అదుపులోకి పెట్టడానికి ప్రయత్నిస్తున్న పోలీసులపై కూడా వారు రాళ్లు రువ్వారు. దీంతో, ప్రస్తుతం రాప్తాడులో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శాంతి భద్రతలను అదుపులో ఉంచడానికి, పోలీసు అధికారులు అదనపు బలగాలను రాప్తాడుకు పంపుతున్నారు.

  • Loading...

More Telugu News