: రోడ్డు రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్త సమ్మె


రవాణారంగంలోని కార్మిక సంఘాలు రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. రోడ్డు రవాణా భద్రతా బిల్లు-2014ను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె జరగనుంది. రేపటి సమ్మెకు తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక సంఘాలైన లారీలు, ట్యాక్సీ, ఆటో సంఘాలు మద్దతు తెలిపాయి. వాటితోపాటు ఈ సమ్మెకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కూడా మద్దతు తెలిపింది. ఈ సమ్మె కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రవాణా స్తంభించే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాలు అరికట్టాలని, ఏడాదికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని, జీడీపి ఏడాదికి 4 శాతం పెంచాలన్నది బిల్లు లక్ష్యాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే బిల్లువల్ల కార్పోరేట్ సంస్థలు, వ్యక్తులకే మేలు జరుగుతుందని రవాణా రంగంలోని పలువురు వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News