: పదేళ్లుగా ఎక్కడున్నారు? ఇప్పుడొచ్చి మాట్లాడితే ఎలా?: రాహుల్ పై హరి సిమ్రత్ ఫైర్


రైతుల సమస్యలపై మోదీ సర్కారును నిలదీసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హరి సిమ్రత్ కౌర్ బాదల్ అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు. పదేళ్లుగా నోరు విప్పని రాహుల్ గాంధీ, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారంటూ ఆమె ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘పదేళ్లుగా రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? నాడు నోరు విప్పకుండా, నేడు మాట్లాడితే ఎలా?’’ అని ఆమె విపక్షాన్ని నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ విమర్శలు, కేంద్ర మంత్రి ఘాటు స్పందనలతో పార్లమెంట్ లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. కౌర్ వ్యాఖ్యలపై విపక్షం అభ్యంతరం వ్యక్తం చేయగా, విపక్ష సభ్యులపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News