: 'మేకిన్ ఇండియా'కు రైతులు అక్కర్లేదా?: మోదీ సర్కారుపై విరుచుకుపడ్డ రాహుల్
'మేకిన్ ఇండియా' అంటున్న మోదీ సర్కారుకు, దేశం ముందుకు వెళ్లే దిశలో రైతుల ప్రాతినిథ్యం అక్కర్లేదా? అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఈ ఉదయం పార్లమెంటులో రైతుల సమస్యపై ప్రసంగించిన ఆయన తనదైన శైలిలో విమర్శలు చేశారు. రైతులను, వారి సమస్యలను పరిష్కరించడంలో ఎన్ డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రధాని మోదీ పర్యటనలతో కాలం గడుపుతూ, రైతుల పంటకు మద్దతు ధర కల్పించడం లేదని వివరించారు. రాహుల్ ప్రసంగానికి కాంగ్రెస్ తదితర విపక్షాల నుంచి అడుగడుగునా మద్దతు లభించగా, పాలకపక్ష సభ్యులు మాత్రం అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కాసేపు గందరగోళం నెలకొంది.