: సొంత కుమారుడికే షాక్ ఇచ్చిన సౌదీ రాజు


సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా ఇటీవలే మరణించడంతో, అతని స్థానంలో రాజుగా బాధ్యతలు చేపట్టిన సవతి సోదరుడు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ తన సొంత కుమారుడికే షాక్ ఇచ్చారు. తన కుమారుడైన మహ్మద్ బిన్ సల్మాన్ ను రాజుగా ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్న సమయంలో... అబ్దుల్ అజీజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న మొహమ్మద్ బిన్ నయీఫ్ ను రాజుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. అంతేకాదు, తన కుమారుడు సల్మాన్ ను నయీఫ్ డిప్యూటీ (యువరాజు)గా ప్రకటించారు. వీరి పరిపాలనలో సౌదీ రాజ్యం ముందుకు సాగుతుందని అన్నారు. సౌదీ రాజుగా పగ్గాలు చేపట్టాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న సల్మాన్... తన తండ్రి నిర్ణయంతో షాక్ కు గురయ్యారు.

  • Loading...

More Telugu News