: ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడిని ఉరి తీసేశారు


అభం శుభం తెలియని, కేవలం ఎనిమిదేళ్ల వయసున్న చిన్నారిని... విచక్షణ మరిచి, కామ దాహంతో, అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, ఆపై పాశవికంగా హత్య చేసిన నరరూప రాక్షసుడు అబ్దుల్ గఫూర్ ను ఈ ఉదయం ఉరి తీశారు. పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న విహరి జిల్లా జైలులో ఈ శిక్షను పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో అమలు చేశారు. 1991లో అబ్దుల్ గఫూర్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం కోర్టు అతడిని దోషిగా తేల్చి, ఉరిశిక్షను విధించింది. అయితే, పాక్ లో ఉరిశిక్షపై నిషేధం ఉండటంతో అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. గత డిసెంబర్ లో పెషావర్ లోని ఆర్మీ పాఠశాలపై విరుచుకుపడిన పాక్ తాలిబన్లు జరిపిన ఊచకోతలో దాదాపు 140 మంది మరణించడంతో... దేశంలో ఉరిశిక్షపై ఉన్న నిషేధాన్ని పాక్ ప్రభుత్వం ఎత్తి వేసింది. దీంతో, గతంలో ఉరిశిక్ష పడి, వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను ఒక్కొక్కరిగా ఉరి తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం గఫూర్ ని ఉరి తీశారు.

  • Loading...

More Telugu News