: క్రికెట్ బుకీలకు కోట్లు తెచ్చిపెడుతున్న ఆ 12 సెకన్లు


తదుపరి బంతికి ఆ ఆటగాడు సిక్స్ కొడతాడా? కొడతాడని రూపాయికి మూడు రూపాయల పందెం. మీరేం చెబుతారు? సాధారణంగా అత్యధికులు 'కొట్టలేరు' అనే చెబుతారు. నెక్స్ట్ బాల్ కు వికెట్ పడుతుందా? అంటే... దానిక్కూడా పడదనే చెబుతారు. తదుపరి బాల్ కు అద్భుతం జరుగుతుందని నూటికి 95 శాతం మంది ఊహించరు. ఇదే ప్రస్తుత ఐపీఎల్ లో బుకీల పంట పండిస్తోంది. కోట్లాది రూపాయల మొత్తం స్పాట్ బెట్టింగుల రూపంలో వారి ఖాతాల్లోకి చేరుతోంది. ఇక్కడ అసలు విషయం ఏమంటే, స్పాట్ బెట్టింగ్ అంటే నాలుగు నుంచి ఐదు సెకన్ల వ్యవధిలో లక్షలాది రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. వాస్తవానికి మైదానంలో ఆటకు, టీవీలో లైవ్ రావడానికి మధ్య కొన్ని సెకన్ల వ్యవధి ఉంటుంది. అయితే, ఈ ఐపీఎల్ ప్రసారం ఏకంగా 12 సెకన్ల ఆలస్యంగా టీవీల్లోకి వస్తోంది. ఇదే బుకీలకు వరమైంది. ఈ వ్యవధిని సొమ్ము చేసుకునేందుకు తమ మనుషులను మైదానంలో పెట్టి బాల్ పడగానే ఏం జరిగిందన్నది తెలుసుకుని బెట్టింగ్ మొదలుపెడతారు. సెకన్ల వ్యవధిలో బెట్ కట్టిన అభిమానులు తమ డబ్బు కోల్పోతున్నారు. ఈ మ్యాచ్ల ఫీడ్ తొలుత సింగపూర్ సర్వర్లలోకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి భారత్ లోని డిష్ లకు అందాల్సి వుండడమే ఈ 12 సెకన్ల ఆలస్యానికి కారణం. ఒకవేళ అదృష్టవశాత్తూ బెట్టింగ్ పెడుతున్న వ్యక్తి నిజం చెబితే, బుకీలు దాన్ని స్వీకరించరు. ఎందుకు తీసుకోలేదని అడిగే లోగానే సమయం మించిపోతుంది కాబట్టి చేసేది కూడా ఏమీ ఉండదు. మొత్తం ఆన్ లైన్, ఫోన్ల మాధ్యమంగా జరుగుతున్న బెట్టింగ్ ను ఎలా ఆపాలో తెలియక అధికారులు తలపట్టుకుంటున్నారు.

  • Loading...

More Telugu News