: గుజరాత్ ను అధిగమిస్తాం...భూముల కేటాయింపులో పారదర్శకత: ఏపీ మంత్రి గంటా


పారిశ్రామికరంగంలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ ను ఆంధ్రప్రదేశ్ అనతికాలంలోనే అధిగమిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో పర్యటించనున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఇండస్ట్రియల్ మిషన్ ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన గంటా, పారిశ్రామికరంగంలో ఏపీ శరవేగంగా వృద్ధి చెందనుందన్నారు. ఇందుకనుగుణంగానే ఇండస్ట్రియల్ మిషన్ ను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ మిషన్ తో అన్ని అనుమతులు సింగిల్ డెస్క్ వద్దే లభిస్తాయన్నారు. గతంలోలా అనుమతుల కోసం పారిశ్రామికవేత్తలు నెలల తరబడి ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. పారిశ్రామికవేత్తలకు భూముల కేటాయింపులో జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని విమర్శలకు తావులేని విధంగా భూకేటాయింపులు చేస్తామన్నారు. ఏ పారిశ్రామికవేత్తకైనా షరతులతో కూడిన భూకేటాయింపులే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News