: బోడిగూడెంలో కత్తుల స్వైర విహారం... నలుగురికి తీవ్ర గాయాలు


ప్రశాంతంగా ఉన్న ఆ పల్లెలో పొద్దున్నే కత్తులు గాల్లోకి లేచాయి. స్వైర విహారం చేశాయి. నలుగురు వ్యక్తులను తీవ్ర గాయాలపాల్జేశాయి. ఆ గాయాలకు గురైన వారు ఆ తర్వాత ఆస్పత్రిలో చేరగా, రక్తంతో తడిసిన కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళితే... పశ్చమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో సమీప బంధువుల మధ్య భూవివాదం తలెత్తింది. ఈ క్రమంలో నేటి ఉదయం ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది. చిన్నగా మొదలైన వాదులాట ఆ తర్వాత పెను ఘర్షణగా మారింది. ఇరు వర్గాలు ఇళ్లల్లోకి వెళ్లి కత్తులతో బయటకొచ్చారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి పంపించివేసి, దాడులకు పాల్పడ్డవారిని గుర్తించే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News