: తమిళనాడులో బస్సు బీభత్సం... ఐదుగురు మృతి
తమిళనాడులో కొద్దిసేపటి క్రితం ఓ బస్సు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలోని తిరువన్నామలై సమీపంలో అదుపు తప్పిన బస్సు ఇళ్లల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బస్సు అదుపు తప్పడానికి గల కారణాలు తెలియరాలేదు.