: హరీశ్ చాకు కాదు చురకత్తి... వెన్నుపోటు తప్పదు: కేసీఆర్ కు రేవంత్ హెచ్చరిక
తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన పొగడ్తలపై టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అంతేకాక నిత్యం కేసీఆర్ పై అంతెత్తున లేచే రేవంత్ రెడ్డి, ఈ సారి ప్రమాదం పొంచి ఉందని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. విషయంలోకి వస్తే, హరీశ్ రావు చాకులా పనిచేస్తున్నారని మొన్నటి పార్టీ బహిరంగ సభా వేదికపై కేసీఆర్ ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి, 'హరీశ్ రావు చాకు కాదు చురకత్తి' అని పేర్కొన్నారు. ఎప్పుడో ఒకప్పుడు అదే చురకత్తి కేసీఆర్ కు వెన్నుపోటు పొడవడం ఖాయమని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.