: ఏపీలో ఇండస్ట్రియల్ మిషన్ కు శ్రీకారం... నేడు విశాఖలో ప్రారంభించనున్న చంద్రబాబు


రాష్ట్ర పునర్విభజన తర్వాత రాజధాని సహా ఇతర మౌలిక సదుపాయాలేవీ లేకుండా ఖాళీ పళ్లెంతో ప్రస్థానం ప్రారంభించిన ఏపీని సీఎం నారా చంద్రబాబునాయుడు శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగా పలు దేశాల్లో పర్యటించిన ఆయన ఇప్పటికే పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలను ఆకర్షించగలిగారు. రాజధానికి పునాది రాయి పడకుండానే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటూ రెండు విదేశీ సంస్థలు ముందుకువచ్చాయి. ఈ నేపథ్యంలో, కొత్తగా రూపొందించిన 'ఇండస్ట్రియల్ మిషన్'కు చంద్రబాబు నేడు శ్రీకారం చుడుతున్నారు. 'ఒకే వేదిక వద్ద అన్ని అనుమతులు' పేరిట తెరపైకి రానున్న ఈ మిషన్ తో మరిన్ని పారిశ్రామిక సంస్థలను రాష్ట్రానికి రాబట్టడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు కసరత్తు చేస్తోంది. నేడు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు ఈ మిషన్ ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News