: భూకంపం రావచ్చని ముందే నిపుణులు హెచ్చరించారా?
నేపాల్ ను అతలాకుతలం చేసిన భూకంపంపై వారం రోజుల ముందే 50 మంది అంతర్జాతీయ భూకంప అధ్యయన నిపుణులు ఖాట్మాండులో సమావేశమై ప్రకృతి విపత్తు నుంచి ప్రజలను ఎలా రక్షించాలని చర్చించారట. పొంచి ఉన్న ప్రమాదం గురించి 'జియో హజార్డ్స్ ఇంటర్నేషనల్' సంస్ధ నెల రోజుల ముందే హెచ్చరించిందట. అయినా నేపాల్ ప్రభుత్వం ప్రాణనష్టాన్ని అరికట్టలేకపోవడం గమనార్హం. భూమండలంపైనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఉన్న ఖాట్మాండు వ్యాలీ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం మినహా మరో పరిష్కారం లాభదాయకం కాదని నిపుణుల సూచన. భూకంపాలను తట్టుకుని నిలబడే ఇళ్లను నిర్మించుకోవడమే ఖాట్మాండు వాసులకు పరిష్కారం. అలా ఇల్లు నిర్మించాలంటే సాధారణంగా కట్టుకునే ఇంటి కంటే పది శాతం అదనంగా ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇంటిని నిర్మించడమే గగనమవుతున్న ప్రస్తుత రోజుల్లో అదనంగా పదిశాతాన్ని భరించలేమని స్థానికులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇలాంటి విపత్తు సమయాల్లో ప్రాణనష్టం పెరిగిపోతోంది.