: '60 ఏళ్ల మురికి' అంటూ ప్రధాని దేశం పరువుతీశారు: రాజ్యసభలో విపక్షాలు


జర్మనీ పర్యటన సందర్భంగా ఎన్ఆర్ఐల సమావేశంలో 60 ఏళ్ల మురికిని శుభ్రం చేస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ దద్దరిల్లింది. ప్రధాని విదేశాల్లో దేశ గౌరవం మంటగలిపారంటూ విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై బీజేపీ సమర్థవంతంగా విపక్ష ఆందోళనను తిప్పికొట్టింది. గత 60 ఏళ్లలో జరిగిన దానికి భిన్నంగా తమ ప్రభుత్వం నడుస్తుందని, స్వచ్ఛ ప్రభుత్వాన్ని తెస్తామని మోదీకి చెప్పే హక్కు ఉందని, విదేశీ గడ్డపై విపక్షాలపై మాట్లాడకూడదనే చట్టం లేదని సభానాయకుడు, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలిగించిన ఆందోళనను అర్ధం చేసుకోగలనని ఆయన చెప్పారు. చేసిన అవినీతితో కాకుండా, అవినీతి ప్రస్తావనతోనే దేశం పరువుపోతుందని జేడీయూ, సీపీఎం భావిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. నేటి సాంకేతిక యుగంలో స్కాం గురించి భారత్ లో చర్చించినా, జర్మనీలో చర్చించినా ఒకటేనని, అందిరికీ తెలిసిపోతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News