: చెట్టెక్కి భయపెట్టిన వ్యక్తి... హడలిపోయిన కాంగ్రెస్ యువత!


నరేంద్ర మోదీ ప్రభుత్వానివి రైతు వ్యతిరేక విధానాలంటూ యూత్ కాంగ్రెస్ ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. కార్యకర్తలు, రైతులు గోధుమ కంకులు, కుప్పలతో ప్రదర్శన నిర్వహించారు. ఐవైసీ కార్యాలయం నుంచి సాగిన ఈ నిరసన ఊరేగింపుకు ఓ వ్యక్తి అరగంటపాటు అంతరాయం కలిగించాడు. అందరిలోనూ భయాందోళనలు రేకెత్తించాడు. అతగాడు చెట్టెక్కడంతో అందరికీ రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఉదంతం కళ్లముందు మెదిలింది. కాంగ్రెస్ కార్యకర్తలు తేరుకుని చెట్టెక్కి, అతడిని క్షేమంగా కిందికి తీసుకువచ్చారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, అతడు నిరసన ప్రదర్శనలో భాగం కాదని, అతడికి మానసిక సమస్యలున్నాయని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ హర్షవర్థన్ తెలిపారు. కాసేపటి తర్వాత పోలీసు విచారణలో అతడెవరన్నది తేలింది. అతడి పేరు పి. లమ్ రెడ్డి అని, నిరసన ప్రదర్శనల్లో రెగ్యులర్ గా పాల్గొంటుంటాడని ఓ దుకాణదారు తెలిపారు. ప్రదర్శనలు బాగా కనిపించేందుకు చెట్లెక్కుతుంటాడని వివరించారు. ఒక్కోసారి చెట్లెక్కి అక్కడే నిద్రపోతుంటాడని కూడా చెప్పారు.

  • Loading...

More Telugu News