: పొన్నం ప్రభాకర్ ను మాట్లాడొద్దని న్యాయస్థానం ఆదేశం


మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పై తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేసిన పరువునష్టం దావా కేసులో సిటీ సివిల్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్లలో కానీ, ఇతర సమావేశాల్లో కానీ మాట్లాడకూడదని ఆదేశించింది. పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్, ఆంధ్రభూమి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వీ6 ఛానెళ్ల నిరాధార ఆరోపణలపై దాఖలైన కేసులో ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి జగదీష్ రెడ్డి అనుమతి లేకుండా ఎలాంటి పబ్లిషింగ్, న్యూస్ టెలికాస్ట్ చేయరాదని కూడా న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News