: టీటీడీ బోర్డు సభ్యుల నియామకంలో పవన్ పాత్ర?


ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న టీటీడీ పాలకమండలిని ఏపీ సర్కారు ప్రకటించడం తెలిసిందే. టీడీపీ నేత చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్ గా నియమితులయ్యారు. కాగా, బోర్డు సభ్యునిగా నియమితుడైన పసుపులేటి హరిప్రసాద్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిఫారసు మేరకే అవకాశం లభించినట్టు కథనాలు వస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం సమయంలో పవన్ తో హరిప్రసాద్ కు పరిచయమైందట. ఆ తర్వాత కూడా పవన్ తో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. హరిప్రసాద్ ను బోర్డు సభ్యునిగా నియమించాలంటూ పవన్ సీఎం చంద్రబాబును కోరగా, ఆయన జనసేన అధినేత మాటకు విలువ ఇచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News