: భారత్ బ్లాంకు చెక్కునిచ్చింది: నేపాల్ రాయబారి
నేపల్ భూకంపం నేపథ్యంలో సహాయం నిమిత్తం భారత ప్రభుత్వం బ్లాంకు చెక్కు ఇచ్చిందని అందుకు నేపాల్ భారత్ కు రుణపడి ఉంటుందని నేపాల్ రాయబారి దిలీప్ కుమార్ ఉపాధ్యాయ తెలిపారు. ఖాట్మాండులో ఆయన మాట్లాడుతూ, నేపాల్ ప్రజలకు తక్షణం టెంట్లు, మెడికల్ కిట్లు చాలా అవసరమని చెప్పారు. వరుస భూ ప్రకంపనలతో నేపాలీలు ఆందోళనలో ఉన్నారని ఆయన వెల్లడించారు. భయానక పరిస్థితి కుదుటపడేందుకు మరో వారంరోజులు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంటువ్యాధులు ప్రబలకుండా సాయం చేయాలని భారత్ ను కోరామని ఆయన తెలిపారు. అన్ని విధాలా ఆదుకుంటున్న భారత ప్రభుత్వానికి ధన్యవాదాలని ఆయన చెప్పారు.