: పవిత్ర గంగను కలుషితం చేస్తున్నవి ఈ నగరాలే: ఉమాభారతి


భారతదేశంలో ఎంతో విశిష్టత కలిగిన పవిత్ర గంగానదిని కలుషితం చేస్తున్న 118 నగరాలను గుర్తించినట్టు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, అలాహాబాద్, పశ్చిమ బెంగాల్ లోని హౌరా నగరాల నుంచి కలుషితాలు పెద్దఎత్తున గంగానదిలో కలుస్తున్నట్టు ఆమె వెల్లడించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని నగరాలు, ఇతర తీర ప్రాంత నగరాలు నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని ఆమె స్పష్టం చేశారు. గంగానది ప్రక్షాళనకు విదేశాల సహకారం తీసుకోనున్నామని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News