: ప్రభుత్వంపై ఉమ్మేయాలని చూస్తే సూర్యునిపై ఉమ్మేసినట్టే: కవిత
టీఆర్ఎస్ ఎంపీ కవిత విపక్షాలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి ప్రజలు మద్దతిస్తుండడాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. ప్రభుత్వంపై ఉమ్మేయాలని చూస్తే సూర్యునిపై ఉమ్మేసినట్టేనని, అది వారిపైనే పడుతుందన్న విషయం గుర్తెరగాలని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుంటే, అది చూసి విపక్షాలు కుళ్లుకుంటున్నాయన్నారు. అందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని కవిత మండిపడ్డారు. చెత్త విమర్శలు కట్టిపెట్టి నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు.