: చెపాక్ లో టాస్ గెలిచిన గౌతీ
చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ కు టాస్ వేశారు. కోల్ కతా నైట్ రైడర్స్ సారథి గౌతమ్ గంభీర్ టాస్ నెగ్గాడు. జట్టు బ్యాటింగ్ వనరులను దృష్టిలో ఉంచుకుని ఛేదనకు మొగ్గు చూపాడు. ఊతప్ప, గంభీర్, పాండే, ఆండ్రీ రస్సెల్, యూసుఫ్ పఠాన్, డష్కాటేలతో కూడిన కోల్ కతా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఉమేశ్ యాదవ్, పాట్ కమ్మిన్స్, చావ్లా, హాగ్ లతో బౌలింగ్ విభాగం వైవిధ్యభరితంగా కనిపిస్తోంది. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికొస్తే... డ్వేన్ స్మిత్, బ్రెండన్ మెక్ కల్లమ్ జోడీపై మరోసారి జట్టు ఆశలు పెట్టుకుంది. వారు శుభారంభం అందిస్తే, రైనా, ధోనీ, డు ప్లెసిస్ రూపంలో ఆ ఒరవడి కొనసాగించగల సమర్థులున్నారు. ఆల్ రౌండర్లు జడేజా, అశ్విన్ ఉండడంతో లోయరార్డర్ కూడా ఉపయుక్తంగా నిలుస్తోంది. బౌలింగ్ ప్రధానంగా నెహ్రా, మోహిత్ శర్మ, అశ్విన్ లపై ఆధారపడి ఉంది. మరి కాసేపట్లో చెన్నై జట్టు బ్యాటింగ్ కు దిగనుంది.