: ఇన్ స్టా గ్రాంలో 'ప్లేబోయ్'తో పోటీ పడుతున్న టౌటౌనీ
సోషల్ ఇమేజ్ మీడియా 'ఇన్ స్టాగ్రాం'లో 'ఇన్ స్టాగ్రామ్ రారాజు' కిరీటం దక్కించుకునేందుకు 'ప్లేబోయ్', సూపర్ రిచ్ డాన్ బిల్డేరియన్ తో పోటీ పడుతున్నాడు 42 ఏళ్ల బ్యాచులర్ టోనీ టౌటౌనీ. 19 ఏళ్ల వయసులో కాలిఫోర్నియాలోని హాలీవుడ్ లో నైట్ క్లబ్ కొనుగోలు చేయడం ద్వారా కోటాను కోట్లు వెనకేసుకున్న టౌటౌనీ సూపర్ రిచ్ గా ఎదిగాడు. టౌటౌనీకి అమెరికాలో కార్ల డీలర్ షిప్ లు, రెస్టారెంట్ లు, పబ్ లు, బార్లు ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేయడం ద్వారా కేవలం 8 నెలల్లోనే టౌటౌనీ విశేషమైన ఆదరణ సంపాదించుకున్నాడు. అందమైన అమ్మాయిలతో అందాల విందు, సూపర్ కార్లు, ప్రైవేట్ జెట్ విమానాలు, విలాసవంతమైన యాట్ లు, వైభవోపేతమైన జీవిత విధానంకు చెందిన ఫోటోలను పోస్టు చేస్తూ ఏడున్నర లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అతని ఇన్ స్టాగ్రాంలోకి వెళ్లగానే 'ధనవంతుడివై దుర్భర జీవితం గడిపే కంటే, పేదవాడిగా సంతోషంగా ఉండడం మేలు అన్నారు. అందుకే సూపర్ డూపర్ రిచ్ కాకుండా, మూడీగా బతుకుతున్నానంటూ' టౌటౌనీ స్వాగతం పలుకుతాడు. అందరూ కలలు కనే జీవితాన్ని అనుభవిస్తున్నానని టౌటౌనీ చెబుతాడు. పురుష పుంగవుడిగా తాను చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశానని నిజాయతీగా చెప్పేస్తాడు. తాను కోరుకున్న అమ్మాయెవరూ తనను కాదనలేదని 'దటీజ్ మై లైఫ్ స్టైల్' అంటూ గర్వంగా చెప్పుకుంటాడు. తన స్టైల్ ను చూసి అంతా ఇష్టపడుతున్నారని చెప్పే టౌటౌనీ, తొందర్లోనే తన ఫ్రెండ్ డాన్ బిల్డేరియన్ ను దాటేసి ఇన్ స్టాగ్రాం రారాజుగా అవతరించే అవకాశం ఉంది.