: ఏప్రిల్ 1 నుంచి ఏపీలో కొత్త పీఆర్సీ అమలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఏప్రిల్ 1 నుంచి 43 శాతం కొత్త ఫిట్ మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ సీఎస్ కృష్ణారావు సంతకాలు చేశారు. నేడుగానీ, రేపుగానీ ఈ విషయంపై ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఏపీలో 4 లక్షల మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. దీని వల్ల మరోవైపు ఏపీ ఖజానాపై రూ.10వేల కోట్ల అదనపు భారం పడనుంది.