: సినిమా ఫక్కీలో బ్యాంకు దోచేశారు


సినీ ఫక్కీలో దుండగులు బ్యాంకును దోచేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నదియా జిల్లాలో అలహాబాద్ బ్యాంకుకి సంబంధించిన ఒక శాఖ కార్యాలయంలో నేటి ఉదయం చోరీ జరిగింది. ఈ ఉదయం విధులకు హాజరయ్యేందుకు సిబ్బంది వచ్చి, బ్యాంకు తాళం తెరుస్తున్న సమయంలో ఒక్కసారిగా కొందరు గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో బ్యాంకులోకి చొరబడి, సిబ్బందిని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. దీంతో సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకులో 47 లక్షల రూపాయలు చోరీకి గురైనట్టు బ్యాంకు సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News