: హైదరాబాదులో మహానాడు... తెలంగాణ జిల్లాల్లో మినీ మహానాడులు
తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైంది. మే 27 నుంచి మూడు రోజుల పాటు వీటిని హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అయితే నగరంలో మహానాడు వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా ఖరారు కాలేదు. అదే సమయంలో తెలంగాణలోని అన్ని జిల్లాలలోనూ మినీ మహానాడులు నిర్వహించాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేసినట్టు తెలిసింది. ఈ మేరకు టీ.టీడీపీ సీనియర్ నేతలతో సచివాలయంలో ఈ రోజు సమావేశమైన బాబు మహనాడుపై చర్చించారు. వాటన్నిటితో పాటు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయించింది.