: అవును నేను ప్రేమిస్తున్నా...అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటా: రణ్ బీర్ కపూర్
బాలీవుడ్ ప్రేమపక్షలు కత్రినా కైఫ్, రణ్ బీర్ కపూర్ ల ప్రేమ సంగతి తెలియని సినీ అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు. తమ ప్రేమపై ఏనాడూ బహిరంగంగా మాట్లాడని రణ్ బీర్ తాజాగా నోరువిప్పాడు. "అవును ప్రేమిస్తున్నాను... ప్రేమను ఆస్వాదిస్తున్నానని...గత ఆరేళ్లుగా నా పెళ్లి గురించి వూహాగానాలు రాస్తూనే ఉన్నారు...ఈ సారికి వూహాగానాలు రాయకండి. వివాహం కుటుంబ వేడుక, అది అందరికీ చెప్పి చేసుకునేది, నేను అందరికీ చెప్పే చేసుకుంటా, తేదీని నాకు వదిలేయండి" అంటూ రణ్ బీర్ చెప్పాడు. 32 ఏళ్ల రణ్ బీర్ తాజాగా సినిమా 'బాంబే వెల్వెట్' రిలీజ్ కు సిద్ధంగా ఉంది.