: రేపు అతనికి మరణశిక్ష... నేడు ప్రియురాలితో వివాహం!


రేపు తెల్లవారు జామున మరణశిక్షకు గురి కానున్న ఓ ఖైదీ తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. డ్రగ్ ట్రాఫికింగ్ లో 2005లో అరెస్టైన ఆస్ట్రేలియా దేశీయుడు ఆండ్రూచాన్ కు నేరం రుజువుకావడంతో ఇండోనేసియా న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశ విదేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇండోనేసియా చట్టప్రకారం ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో అరెస్టైన 9 మందికి రేపు తెల్లవారుజామున జైలు అధికారులు మరణశిక్షను అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మరణశిక్ష అమలుకు ముందు ఖైదీలను చివరి కోరిక అడిగారు. ఆస్ట్రేలియాకు చెందిన మ్యూరన్ సుకుమారన్ చివరి క్షణాల వరకు పెయింటింగులు వేసేలా చూడాలని కోరగా, ఆండ్రూ చాన్ తన ప్రియురాలిని వివాహమాడాలని ఉందని చెప్పాడు. దీంతో ఆండ్రూ చాన్ చివరి కోరికను జైలు అధికారులు తీర్చారు. జైలులోనే ఖైదీల సమక్షంలో వారి వివాహం ఘనంగా నిర్వహించారు.

  • Loading...

More Telugu News