: మడోన్నా మనసు దోచిన మోడల్


పాప్ సంగీత ప్రపంచంలో రారాణి మడోన్నా (56) ఇప్పుడు ఒంటరి. గత వేసవిలో బాయ్ ఫ్రెండ్ తిమోర్ స్టెఫ్ఫెన్స్ కు గుడ్ బై చెప్పిన ఈ సూపర్ స్టార్ ఓ పురుష మోడల్ పై మనసు పారేసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆండ్రీ డెన్వర్ అనే అందగాడి ఫొటోను మడోన్నా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో తాజా ఊహాగానాలు బయల్దేరాయి. తన ఎయిట్ ప్యాక్ ను ప్రదర్శిస్తున్న డెన్వర్ ఫొటోను పోస్టు చేసిన అమ్మడు దాని కింద "రెబెల్ 8 ప్యాక్..." అంటూ క్యాప్షన్ కూడా రాసింది. అటు, మడోన్నా తన ఫొటోను పోస్టు చేయడం పట్ల మోడల్ డెన్వర్ ఉబ్బితబ్బిబ్బయిపోతున్నట్టు సమాచారం. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో? అన్నట్టు... అతగాడు మడోన్నా కంటే 33 ఏళ్లు చిన్నవాడట.

  • Loading...

More Telugu News