: ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయండి!: పోలీసులకు జమ్మూ ఐజీపీ వార్నింగ్
పోలీస్ డిపార్ట్ మెంట్ లో కాస్త సిన్సియర్ అధికారి పదవి చేపడితే నేరగాళ్లను ఉద్దేశించి, ఒళ్లు దగ్గరపెట్టుకుని నడుచుకోండి, లేదంటే తాటతీస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం సహజం. కానీ, ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని జమ్మూకాశ్మీర్ లోని పోలీసులను ఐజీపీ దానిష్ రాణా హెచ్చరించారు. మాఫియా, మోసాలకు పాల్పడేవారు, నేరగాళ్లతో పోలీసుల దోస్తీ ఎక్కువైందని ఆయన మండిపడ్డారు. వీరంతా చేసే అక్రమ దందాలకు ఎవరైనా పోలీసులు సహకరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నేరగాళ్లు, స్మగ్లర్లు, మాఫియా లీడర్లు, మోసగాళ్లు శిక్షార్హులని, వారి విషయంలో ఎలాంటి కనికరం అవసరం లేదని ఆయన తెలిపారు.