: టీటీడీ బోర్డులో ఖైరతాబాద్ ఎమ్మెల్యేకు మొండిచేయి... మనస్తాపానికి గురైన బీజేపీ నేత


తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందులో తన పేరు లేకపోవడంపై ఖైరతాబాద్ బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మనస్తాపానికి లోనయ్యారు. సొంత పార్టీ నేతలే తనకు పాలకమండలిలో అవకాశం రాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీటీడీ బోర్డులో తెలంగాణ నుంచి బీజేపీ, టీడీపీలో కొందరు నేతలకు అవకాశం ఇవ్వనున్నట్టు కొన్ని రోజుల కిందట వార్తలు వచ్చాయి. అందులో ప్రధానంగా చింతల పేరు మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో బోర్డులో సభ్యుడిగా తన పేరుంటుందని ఆయనతో సహా అంతా అనుకున్నారు. చివరికేమైందోగానీ తాజాగా ప్రకటించిన జాబితాలో చింతల పేరు లేదు. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారని, పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేరని సమాచారం.

  • Loading...

More Telugu News