: తెలంగాణ సర్కారుపై విమలక్క ధ్వజం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా గాయకురాలు విమలక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్తులను తెగనమ్మడమే సర్కారు ధూంధాం అని అన్నారు. అయితే ప్రభుత్వ ధూంధాం వేరు, ప్రజల ధూంధాం వేరన్నారామె. నిరుద్యోగ కళాకారులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల వైపో, ప్రభుత్వం వైపో కళాకారులు తేల్చుకోవాలని చెప్పారు. కూకట్ పల్లి అల్లీపూర్ లో కబ్జాదారులకు ఎమ్మెల్యే కృష్ణారావు, అధికారులు మద్దతు పలుకుతున్నారని విమలక్క ఆరోపించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్కడ పట్టాదారుల ఇళ్లను కూల్చేస్తున్నారని మండిపడ్డారు.