: ‘ఎర్ర’ హీరోయిన్ నీతూను కస్టడీకి అప్పగించండి... ఆళ్లగడ్డ కోర్టులో పోలీసుల పిటిషన్


ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్ కు మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్, వైసీపీ నేత మస్తాన్ వలీని పెళ్లి చేసుకుని, అతడి చీకటి దందాకు సహకరించిన నీతూను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆళ్లగడ్డ కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను నంద్యాల సబ్ జైలుకు తరలించారు. తాజాగా నీతూ అగర్వాల్ ను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు ఆళ్లగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను విచారించడం ద్వారా ఈ కేసులో మరింత కీలక సమాచారం లభిస్తుందని వాదిస్తున్న పోలీసులు, కోర్టు ముంగిట కూడా అదే వాదన వినిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News