: మోదీ ఎప్పుడూ అలర్టేనట... భూకంపం సమాచారం ముందు ఆయనకే చేరిందట!


దేశంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా, క్షణాల్లో కేంద్ర హోం శాఖకు చేరిపోతుంది. ఇక ప్రపంచంలో పెద్ద ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలపై కూడా హోంశాఖకే తొలి సమాచారం అందుతుంది. ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కొనసాగుతున్నారు. విధి నిర్వహణలో రాజ్ నాథ్ మెరుగైన పనితీరే కనబరుస్తున్నారు. అయితే గత శనివారం ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. అప్పటిదాకా ప్రధానితోనే ఉన్న రాజ్ నాథ్, ఐదు నిమిషాల క్రితమే ప్రధాని దగ్గర నుంచి వచ్చేశారు. ఇంటిలో అడుగుపెడుతున్న రాజ్ నాధ్ కు మోదీ నుంచి ఫోన్ వచ్చిందట. వెనువెంటనే అత్యున్నత సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధాని ఆర్డరేశారు. ఏ జరిగిందన్న రాజ్ నాథ్, మోదీ చెప్పిన సమాధానంతో షాక్ తిన్నారట. నేపాల్ లో పెను భూకంపం సంభవించిన విషయం తనకంటే ముందుగానే ప్రధానికి చేరిపోయిందని తెలుసుకున్న రాజ్ నాథ్, వెంటనే కార్యరంగంలోకి దిగిపోయారట. ఈ విషయాన్ని రాజ్ నాథే నిన్నటి పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు. ఎప్పుడూ అలర్ట్ గా ఉండే ప్రధాని కింద పనిచేయడం తనకు కాస్తంత గర్వంగానే ఉందని కూడా రాజ్ నాథ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News